కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

కరోనా మహమ్మారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతిచెందారు.

Update: 2020-04-02 06:06 GMT
Nirmal Singh Khalsa

కరోనా మహమ్మారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతిచెందారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమృత్‌సర్‌ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్‌ సింగ్‌ ఖల్సా (62)కు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దాంతో ఆయనను పంజాబ్‌లోని గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో చేర్చారు గురువారం ఆయనకు చికిత్స అందిస్తుండగా.. తెల్లవారుజామున ఆరోగ్యం విషమించి మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిర్మల్‌ సింగ్‌ కరోనా వైరస్‌ కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా నిర్మల్‌ సింగ్‌ ఖల్సా పంజాబ్‌లోని ప్రఖ్యాత అమృత్‌సర్‌ దేవాలయంలో అత్యున్నత పదవిలో తన సేవలందించారు. ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ రోజురోజూకూ విజృభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 వందలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయితే.. 45మందికి పైగా మృతి చెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.


Tags:    

Similar News