oxford corona vaccine : సీరం ఇన్స్టిట్యూట్ కు అనుమతి

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే.ఇండియాలో ఈ వ్యాక్సిన్ తయారీకి పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ భాగస్వామిగా..

Update: 2020-09-16 05:05 GMT

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే.ఇండియాలో ఈ వ్యాక్సిన్ తయారీకి పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ భాగస్వామిగా ఉంది. అయితే బ్రిటన్ లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నాలుగురోజులపాటు నిలిచిపోయాయి. ఈ క్రమంలో భారతదేశంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) కూడా సెప్టెంబర్ 11 న పరీక్షలను నిలిపివేసింది.. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆక్స్ ఫర్డ్ లో రెండు రోజుల కిందట మళ్ళీ పునప్రారంభం కావడంతో.. సీరం ఇన్స్టిట్యూట్ కు కూడా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్నీ సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో రెండవ మరియు మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయని వెల్లడించింది. కాగా ఆక్స్ ఫర్డ్ లో ఈ టీకా ట్రయల్స్ మూడవ దశకు చేరుకున్నాయి. ఇందులో 50 వేలకు పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. ఇదిలావుండగా, దేశంలో 3 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డిజి ప్రొఫెసర్ బలరాం భార్గవ తెలిపారు. మరోవైపు దేశంలో రోగుల సంఖ్య 50 లక్షలు దాటింది, ఇప్పటివరకు 50 లక్షల 20 వేల 360 మందికి వ్యాధి సోకినట్లు గుర్తించారు. గత 24 గంటల్లో కొత్తగా 90 వేల 123 మంది కొత్త రోగులు పెరిగారు.    

Tags:    

Similar News