Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్.. ఈ లోగోను ఎవరు రూపొందించారో తెలుసా...?
Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడి గర్వాన్ని, కోపాన్ని, గుండె నిండిన బాధను ఈ లోగో మౌనంగా వర్ణిస్తుంది.
Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్.. ఈ లోగోను ఎవరు రూపొందించారో తెలుసా...?
Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడి గర్వాన్ని, కోపాన్ని, గుండె నిండిన బాధను ఈ లోగో మౌనంగా వర్ణిస్తుంది. ఇక ఈ లోగోను ఎవరు రూపొందించారో తెలుసా...? ఈ లోగోను ఇద్దరు భారతీయ సైనికులు రూపొందించారు. ఒకరు లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా, మరొకరు హవల్దార్ సురీందర్ సింగ్. వీరిద్దరూ భారత సైన్యంలో సేవలందిస్తున్న ధైర్యవంతులు. ఏప్రిల్ 22, 2025న ఫహల్గాం ఉగ్రదాడికి దేశం దిగులుగా ఉన్న సమయంలో ప్రతీకారానికి రూపం అవసరమైంది. ఆ రూపం... ఈ లోగో రూపంలో వెలుగులోకి వచ్చింది.
లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా.. ఆర్మీ ఇంటెలిజెన్స్ వింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న అధికారి. మరోవైపు హవల్దార్ సురీందర్ సింగ్... ఆర్మీ గ్రౌండ్‌లో సేవలందిస్తూ, సైనికునిగా ఉన్న అనుభవాన్ని భావాలుగా మార్చగల నైపుణ్యం ఉన్నవాడు. వీరిద్దరి అనుభవం, ఆవేశం, దేశభక్తి కలిసే ఈ రూపాన్ని సృష్టించింది. సాధారణంగా ఏ ఆపరేషన్‌కైనా పేర్లు కోడ్‌లా ఉంటాయి. కానీ ఈసారి 'సింధూరం' అనే పదాన్ని దేశం విన్నపుడు ఒక్కసారి హృదయం కదిలిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా, ఒక ఆపరేషన్‌కు సంబంధించి ఒక లోగోను దేశం గర్వంగా చూసింది. సోషల్ మీడియాలోనూ, వార్తా చానల్స్‌లోనూ ఈ లోగో వైరల్ అయ్యింది. కానీ ఆ వెనుక ఉన్న కలం ఎవరిదీ, ఆ చేతి గీతలు ఎవరివో చాలా మందికి తెలియదు. కొంతకాలం పాటు సస్పెన్స్ పాటించిన ప్రభుత్వం.. ఈ ఇద్దరు సైనికుల పేరు బయటకు తెచ్చింది. అయితే వీరి జీవితాలపై పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు. వాళ్లపై రక్షణ మంత్రిత్వ శాఖ భద్రతాపరమైన పరిమితులు పెట్టినట్టు సమాచారం.
ఇక వీరి చేతుల్లోంచి వచ్చిన ఈ లోగోను చూసి, ప్రతి భార్య కన్నీటిని తుడిచింది. ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తి చూశాడు. వీరి పని మాటల్లో చెప్పలేనిది. దాన్ని ఒక్క చూపుతోనే తెలిసిపోతుంది. ఉగ్రదాడిలో ప్రాణం కోల్పోయినవారికి ఇది ఓ నివాళి. దేశం తీర్చిన ప్రతీకారానికి ఇది ఓ గుర్తు. వీరిద్దరి హస్తకళ ఎంత గొప్పదో, వారి దేశభక్తి అంతకన్నా గొప్పది. ఇంతటి లోతైన భావాన్ని కలిగించిన ఈ లోగో వెనుక ఉన్న వీరి కథ.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. దేశం ఇప్పుడు మాత్రమే ఈ కళాకార సైనికులను గుర్తుపెట్టుకుంటోంది. కానీ వీరి రూపం ద్వారా వారు దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.