ఉల్లి ధర నుంచి గుడ్ న్యూస్..

Update: 2019-12-09 14:18 GMT

దేశవ్యాప్తంగా ఉల్లి రేటు ఆకాశానంటింది. ఉల్లి లేనిదే ఏ వంట ఉండదు. అలాంటి ఉల్లి ధరలు బుల్లెట్ రైలు కంటే వేగంగా పెరిగిపోయాయి. కొన్ని హోటల్లలో ఉల్లి ఆడగొద్దు అని బోర్డులు పెట్టారు. అంతే కాదు ఏకంగా ఉల్లి దోశను మెనులోంచి తీసేశారు. మధురై, బెంగళూర్‌ నగరాల్లో ఉల్లి ధర కిలో రూ 200పైగా పలకడంతో గగ్గోలు పెడుతున్నారు. ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు వరదలతో పంటలు దెబ్బతీన్నాయి. పంట దిగుబడి తగ్గడంతో ఉల్లి రిటైల్‌ ధరలు గత పెరిపోయాయి.

ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉల్లి ధరలనుంచి కేంద్ర ఉపశమనం కలిగించనుంది. ఆప్ఘనిస్తాన్‌, టర్కీల నుంచి ఉల్లి దిగుమతవుతున్న క్రమంలో ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. ఢిల్లీలో కీలో 65 నుంచి 80 వరకూ పలుకగా, సోమవారం నుంచి రూ 50-75కే దిగొచ్చింది. ఆజాద్‌పూర్‌ మండీ కురగాయల మార్కెట్లో ఉల్లి 200 టన్నుల దిగుమతులు చేరుకోవడంతో ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఉల్లి ధరల నుంచి ఉపశమనం కలుగుతుందనే వార్తలు వస్తోన్నాయి. 80 ట్రక్కుల ఉల్లి ఆప్ఘనిస్తాన్‌, టర్కీల నుంచి ఢిల్లీలోని మార్కెట్ కు చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులు ఆగితేగాని ఉల్లి ధరలు పూర్తిగా అదుపులోకి రావు. 

నిన్నమొన్నటి వరకూ మధురై, బెంగళూర్‌ నగరాల్లో కిలో రూ.150 పలకడంతో మార్కెట్ సరఫరా పడిపోవడంతో పెరిపోయింది.క్వింటాల్‌కు ఉల్లి ధర 6వేల నుంచి రూ 14 వేలకు చేరడంతో రిటైల్‌ ధరలు 200 రుపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఆదివారం ఉదయం ఉల్లిపాయలు 5టన్నులు మార్కెట్ శాఖ అమ్మకానికి పెట్టింది. పెట్టిన నాలుగు గంట్లోనే ముగిశాయి. ఆధికారులు రూ.25 అందజేయడంతో జనం ఎగబడ్డారు. తిరుపతి వాసులే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా రావడంతో ఐదు టన్నుల ఉల్లి వెంటనే అయిపోయింది. ఇదే కోణంలో ఒక వృద్ధుడు సబ్సీడీ ఉల్లి కోసం క్యూ లైన్లో నిలుచుని తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ విశాదకరమైన సంఘటన గుడివాడలో చోటు చేసుకుంది. 

Tags:    

Similar News