Jammu Kashmir: జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Jammu Kashmir: సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. అర్షిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి బలగాలు. అయితే కార్డన్ సెర్చ్ చేస్తుండగా ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు చేసిన భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. మరికొందరు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.