N.V. Ramana: చీఫ్ జస్టిస్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎన్వీ రమణ

Justice N.V. Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Update: 2021-04-23 06:56 GMT

Justice N.V. Ramana:(File Image)

Justice N.V. Ramana: సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు(శనివారం) ఉదయం 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

భారత్ లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్‌ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశముంది.

Tags:    

Similar News