మహారాష్ట్ర ‌: రెండు లేఖలు సమర్పించండి..విచారణ రేపటికి వాయిదా

గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో తలపుతట్టిన విషయం తెలిసిందే.

Update: 2019-11-24 07:20 GMT
No Maharashtra Floor Test For Now Supreme Court Asks For 2 Key Letters Tomorrow

మహారాష్ట్రలో రాజకీయాలు క్షణం క్షణం మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టులో తలపుతట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సర్వోన్నత ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్నజస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ సహా అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. తుది తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం 11.30 గంటలకు తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.

అయితే ఇప్పటికిప్పుడు బలపరీక్ష అవసరంలేదని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై రేపు ఉదయం 10.30 గంటలకు విచారిస్తామని పేర్కొంది. సీఎం ఫడ్నావీస్ మోజార్టీ లేఖను. గవర్నర్‌కు ఇచ్చిన మద్దతు లేఖను కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది. సోలీసెటర్ లేఖ కూడా ఇవ్వాలి తెలిపింది. రెండు లేఖలు ఇచ్చిన తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. బీజేపీ తరఫున ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని, బీజేపీ శివసేన కూటమి ఇప్పుడు లేదని శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమిగా ఉన్నాయని సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కేబినెట్ నిర్ణయం లేకుండా రాష్ట్రపతి పాలన ఎలా తొలిగిస్తారిని నిలదీశారు. రాష్ట్రపతి పాలన తొలిగించాలని గవర్నర్ సిఫార్సు ఏంటని ప్రశ్నించారు.

బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు బలం ఉంటే తక్షణే నిరుపించుకోవాలని అందుకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఎమ్మెల్యేల సంతాకాలతో అజిత్ గవర్నర్ కు ఇచ్చిన లేఖ చెల్లదని అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. బీజేపీ తరపున లాయర్ ముకుల్ రోహత్గీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించారని పేర్కొన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయలేరని స్పష్టం చేశారు. ఆర్టికల్ 361 గవర్నర్‌కు అధికారం ఉందని కోర్టుకు తెలిపారు. అసెంబ్లీని ఏర్పాటు చేసి బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

Tags:    

Similar News