ఢిల్లీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం కేజ్రీవాల్‌..

Update: 2019-08-01 11:25 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. సామాన్య ప్రజల శ్రేయస్సుకోరి ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రీ లైప్ లైన్ ఎలక్ట్రిపిటీ స్కీలంలో భాగంగా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. కాగా వినియోగదారులు బిల్లు కట్టాల్పినపనే లేదని సీఎం స్పష్టం చేశారు. కాగా 200-400 యూనిట్ల విద్యుత్‌ వినియోగదారులకు 50 శాతం రాయితీని ప్రకటించారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని నేటి నుంచే అమల్లోకి రానుంది. దేశంలోనే అతి తక్కువ ధరకు విద్యుత్‌ దొరికే ప్రాంతం కేవలం ఢిల్లీయేనని.. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయమని సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. ఈ నిర్ణయం సామాన్యులకు ఎంతో ఉపయుక్తం అన్నారు. ప్రతి నెల 200 యూనిట్ల వరకు వాడుకునే వారికి విద్యుత్‌ బిల్లులు లేవని తెలిపారు. ఢిల్లీలో 33 శాతం మంది విద్యుత్‌ వినియోగదారులు నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నట్లుగా సమాచారం. ఈ స్కీం అమలులోకి వస్తే సామాన్యుడు ఈ బిల్లు కట్టకుండా ఉచితంగానే కరెంట్‌ను వినియోగించుకోవచ్చు.  

Tags:    

Similar News