Nithyananda swamy reserve bank: నిత్యానంద స్వామి స్వంత రిజర్వు బ్యాంక్.. ఎక్కడుందంటే..!

Update: 2020-08-20 01:45 GMT

Reserve Bank of Kailasa: పరారీలో ఉన్న వివాదాస్పద మత గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తాను ఏర్పాటు చేసుకున్న హిందూ దేశంలో సొంత రిజర్వ్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు తెలియజేస్తూ వీడియోను విడుదల చేశాడు. వివాదాస్పద మత గురువు నిత్యానంద తను ఏర్పాటు చేసుకున్న కైలాశ ద్వీపంలో ప్రత్యేక రిజర్వ్ బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు సంచలన వీడియోను విడుదల చేసాడు. వినాయకుడి ఆశిస్సులతో గణేష చతుర్ధి రోజు నుంచే బ్యాంకు లావాదేవీలు మొదలవుతాయని తెలిపాడు. అదే రోజు నుంచి ఆర్బీకే కరెన్సీ చలామణిలోకి వస్తుందని వివరించాడు.

ఇందుకు సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు స్పష్టం చేశాడు. ఏ దేశ కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. కరెన్సీ రూపు రేఖలు, విధి విధానాలు 22న ప్రకటిస్తామని నిత్యానంద తెలిపారు. నిత్యానంద కరెన్సీగా ఇప్పటికే కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ అవుతున్నాయి. పిల్లల అక్రమ నిర్బంధం, మహిళల అదృశ్యం, అపహరణ కేసుల్లో గతేడాది తప్పించుకుని, దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఈక్వెడార్‌లోని భాగమైన ఓ ద్వీపాన్ని కొని, అక్కడ హిందూదేశం నిర్మించుకొన్నట్టు తొలుత వార్తలొచ్చాయి. అధికార మతంగా సనాతన హైందవాన్ని ప్రకటించుకొన్న ఈ దేశంలో పాస్‌పోర్టు నుంచి పౌరసత్వం దాకా ప్రతీది ప్రత్యేకమేనని కథనాలు వెలువడ్డాయి.



Tags:    

Similar News