ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం

స్థానిక ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదు అయింది. బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికలు గురువారం జరిగాయి ఈ ఎన్నికల్లో 98.3శాతం పోలింగ్ నమోదైయింది.

Update: 2019-10-25 09:13 GMT

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం ఇంటర్నెట్ మినహా పోస్టుపేడ్ సేవలు మళ్లీ పునరుద్ధరించడమే కాకుండా యాత్రికులను కూడా అనుమతించారు.ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదు అయింది. బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికలు గురువారం జరిగాయి ఈ ఎన్నికల్లో 98.3శాతం పోలింగ్ నమోదైయింది.

దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన గొప్ప విషయమన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్, లేహ్, లద్ధాఖ్ లో ప్రాంతీయ మండలి ఎన్నికలు జరగడం సంతోషకరమైన విషయమన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు . చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతు తెలిపిన పార్లమెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు అంటూ మోదీ ట్వీట్ చేశారు.






Tags:    

Similar News