అజిత్ పవార్‌పై ఎన్సీపీ వేటు

Update: 2019-11-23 06:54 GMT
Ajit Anantrao Pawar

మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం మలుపులు తిరుగుతున్నాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు తెలపడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న ఆయనను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ పార్టీ ఆఫీసులో కొద్ది సేపు హైడ్రామా కొనసాగింది. అజిత్ పవర్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అజిత్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ బలపరీక్షకు అజిత్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీలో కొందరు మాత్రం అజిత్ వెంట 10మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. 

Tags:    

Similar News