మా నాయకులు జైల్లో ఉన్నారు...ఎన్నికల్లో పోటీ చేయం

జమ్ముకశ్మీర్‎కు ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు నెలల పాటు ఉన్న ఎస్సీపీ అధినేత ఫరూక్ అబ్ధుల్లాను గృహ నిర్భంధంలో ఉంచిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఆయన తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

Update: 2019-10-06 13:20 GMT

జమ్ముకశ్మీర్‎కు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా రెండు నెలల పాటు ఎస్సీపీ అధినేత ఫరూక్ అబ్ధుల్లాను గృహ నిర్భంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన నివాసంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అబ్ధుల్లాతో భేటీ అనంతరం  సీనియర్ పార్టీ నేత హస్నావి మసూద్ మాట్లాడుతూ.. తాము కేవలం అబ్దుల్లాను మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా ఆయన తెలిపారు. భేటీ లో ఎలాంటి రాజకీయాలు చర్చిలేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడంలేదని, నాయకులంతా జైల్లో ఉన్నారని పేర్కొన్నారు.

అధికారణ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో ఆంక్షలు విధించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఆంక్షలు సవరించింది. నిర్భంధించిన స్థానిక నేతలను విడుదల చేస్తామని గవర్నర్ సలహాదారు ఫరూఖ్ ఖాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News