Narendra Modi: నేడు కేరళకు ప్రధాని నరేంద్ర మోడీ
Narendra Modi: రెండు రోజులపాటు కేరళలో పర్యటించనున్న ప్రధాని
Narendra Modi: నేడు కేరళకు ప్రధాని నరేంద్ర మోడీ
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి కేరళలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఆ రాష్ట్రానికి చేరుకున్న వెంటనే.. కొచ్చిన్‌లో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు ప్రధాని. అనంతరం దేశంలో తొలి డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు చర్చి పెద్దలతో సమావేశమవుతారు. ఇక ప్రధాని తన పర్యటనలో భాగంగా..వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్ ప్రారంభత్సవంతో పాటు యువజనుల కార్యక్రమం యువమ్–2023కి హాజరవుతారు .
మోడీ పర్యటన ద్వారా పార్టీ క్యాడర్‌లో ఉత్తేజం కలిగించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. ప్రధాని పర్యటన బందోబస్తులో 2 వేల 60 మందిని వినియోగించనున్నారు. పర్యటన సమయంలో ప్రధాని మోడీని ఆత్మాహుతి బాంబర్‌తో చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పేరుతో ఆ లేఖ రాసిన కొచ్చిన్‌కు చెందిన వ్యాపారి జేవియర్‌ని అదుపులోకి తీసుకున్నామని, జానీ అనే వ్యక్తిపై కక్షతోనే అతడు ఈ పనికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.