మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తన మొబైల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు.

Update: 2019-11-03 06:37 GMT
mamata banerjee

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తన మొబైల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాంపింగ్‌ చేసిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఫోన్‌ను కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. కొందరి లాయర్లు , జర్నలిస్టుల, వ్యక్తిగత సమాచారం  సోషల్ మీడియా ద్వారా చోరీకి గురైందని ఆ సంస్థలు అధికారులు అంగీకరించిన సంగతి తెలిసిందే.

మమతా బెనర్జీ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రధాని మోదీని కోరతామని వ్యాఖ్యానించారు. రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ట్యాపింగ్ జరిగిందన్నారు. అలాగే చాలా మంది ప్రముఖుల వ్యక్తిగత సమాచారం చోరికి గురవుతోందని ఆమె ఆరోపించారు. పౌరుల వ్యక్తిగతల స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని చాలా సార్లు చెప్పానని మమతా బెనర్జీ తెలిపారు.

Tags:    

Similar News