ముంబై హైకోర్టు సంచలన తీర్పు

ముంబైలోని ఆరే ప్రాంతంలో చెట్ల నరికివేతను నిరసిస్తూ దాఖలైన పిటిషన్లు బాంబే హైకోర్టు కొట్టివేసింది. చెట్లను నరికి మెట్రో రైలు కారు షెడ్ భవనాల నిర్మాణం చెపట్టనున్నట్టు ముంబయి మెట్రో రైలు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2019-10-04 10:28 GMT

ముంబైలోని ఆరే ప్రాంతంలో చెట్ల నరికివేతను నిరసిస్తూ దాఖలైన పిటిషన్లు బాంబే హైకోర్టు కొట్టివేసింది. చెట్లను నరికి మెట్రో రైలు కారు షెడ్ భవనాల నిర్మాణం చెపట్టనున్నట్టు ముంబయి మెట్రో రైలు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లగా పర్యావరణ ప్రేమికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్యమానికి పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు.

ఆరే కాలనీని అటవీ ప్రాతంగా ప్రకటించాలని కోరుతూ వనశక్తి అనే ఎన్జీవో సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు చేసిన నాలుగు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. అది అడవి కాదు అక్కడ చెట్లు నరికివేత నిలిపివేయాలన్న వాదనను తిరస్కరించింది. ఈ మేరకు తీర్పు వెల్లడిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ డాంగ్రేతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున ఆందోళ చేపట్టారు.

Tags:    

Similar News