కుక్క కోసం ప్రాణాలు అర్పించారు..

ప్రాణంగా పెంచుకుంటున్నా కుక్కను కాపాడే క్రమంలో తల్లీ, కొడుకూ ప్రాణాలు కొల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వార్ధాలో జరిగింది. దీపాలీ మశ్రామ్ (40), రోహిత్ మశ్రామ్ (23)తోపాటూ... కుక్క కూడా ప్రాణాలు విడిచింది.

Update: 2019-09-06 08:07 GMT

ఓ కుక్క కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు. ఒక్క కుక్క కోసం ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారు కుక్కకోసం చేసిన త్యాగం చూసి అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. నెటిజన్లు సైతం సలాం వారికి సలాం చేస్తున్నారు. ప్రాణంగా పెంచుకుంటున్నా కుక్కను కాపాడే క్రమంలో తల్లీ, కొడుకూ ప్రాణాలు కొల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వార్ధాలో జరిగింది. దీపాలీ మశ్రామ్ (40), రోహిత్ మశ్రామ్ (23)తోపాటూ... కుక్క కూడా ప్రాణాలు విడిచింది. ఇక వివరాల్లోకి వెళితే.. రోహిత్ తన గదిలో బట్టలకు ఐరన్ చేసుకుంటున్నాడు. ఐతే ఐరన్ బాక్సుకి ఉన్న కరెంటు వైర్‌ని ముందు రోజే ఎలుకలు కొరికేశాయి. అయితే ఆ విషయాన్ని రోహిత్ గమనించలేదు. ఈ క్రమంలోనే వాళ్ల ఇంట్లో ఉంటున్నా పెంపుడు కుక్క అనుకోకుండా ఐరన్ బాక్స్ ఉన్న వైరును చుట్టుకొని కరెంటు షాక్ తగిలింది. అయితే దిన్ని గమనించిన రోహిత్... తమ కుక్కను ఎలాగైనా రక్షించాలనే టెన్షన్‌లో కరెంట్ వైరును తొలగించబోయి.. కుక్కను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగాడు దీంతో అతడికి కూడా కరెంటు షాక్ కొట్టింది.

కుక్క అరుపులు, రోహిత్ అరుపులు విన్నా తల్లి దీపాలీ మశ్రామ్ వంట గది నుండి హుటాహుటినా పరుగులు తీసింది. వెంటనే అక్కడ పరిస్థితిని చూసి వామ్మోం నా కోడుకా అంటూ ఎడ్చుకుంటూ ఆమె కుడా కొడుకు చేతులు పట్టుకుంది.దీంతో తనకు కూడా కరెంట్ షాక్ కొట్టింది. ముగ్గురికీ షాక్ గట్టిగా తగిలింది. ఇంతలోనే దీపాలీ భర్త సిద్ధార్థ వాళ్లను చూసి హుటాహుటినా పరిగెత్తుకొచ్చాడు. భార్య, కొడుకును విడిపించాలని గట్టిగా పట్టుకున్నాడు. ఆయనకూ కరెంటు షాక్ తగిలింది. నలుగురు కరెంట్ షాక్ తో వీలవీల లాడుతున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన పెద్ద కొడుకు ప్రవీణ్ మశ్రామ్ వాళ్లను చూసి కంగారు పడ్డారు. అయితే వారిల కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించి మెయిన్ పవర్ సప్లై ఆపేశాడు. అయితే అప్పటికే కుక్క, రోహిత్ చనిపోయారు. తల్లిదండ్రులను జిల్లా జనరల్ హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే... తల్లి దారిలోనే ప్రాణాలు విడిచింది. కాగా, ప్రస్తుతం తండ్రి సిద్ధార్థ పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, కుక్క కోసం ప్రాణాలు అర్పించిన ఆ కుటుంబాన్ని చూసి అయ్యో పాపం అంటున్నారు స్థానికులు. 


Tags:    

Similar News