చంద్రయాన్ -2తో కథ ముగియలేదు... ఆదిత్య ఎల్1తో సూర్యడిపైకి

ఆదిత్యఎల్1 మానవ రహిత అంతరిక్ష యాత్రపై తమ దృష్టి పెట్టామని శివన్ తెలిపారు.

Update: 2019-11-02 11:17 GMT
ISRO chief K Sivan

చంద్రయాన్-2 ప్రయోగంతో సాంకేతికతపరంగా ఇస్ర్లో ముందుకు వెళ్లిందని ఇస్రో చైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే కాలంలో అత్యాధునిక శాటిలైట్ లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.ఐఐటీ ఢిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టాఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామని వ్యాఖ్యానించారు. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని సిద్ధం చేస్తున్నసంగతి తెలిసిందే. ఆదిత్య ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధమైందని తెలిపారు. ఆదిత్యఎల్1 మానవ రహిత అంతరిక్ష యాత్రపై తమ దృష్టి పెట్టామని శివన్ తెలిపారు.

విద్యార్థలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో డబ్బు కోసం కాకుండా లక్ష్యం కోసం పనిచేయాలని సూచించారు. ఐఐటీ డిల్లీ స్పేస్ టెక్నాలజీ నెలకొలప్పడంపై ఇరు సంస్థలు ఈ కార్యక్రమం ఒప్పందం కుదిరింది. ఇస్రో నావిక్ సిగ్నల్స్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని శివన్ తెలిపారు. ఉపగ్రహాధారిత నావిగేషన్ వ్యవస్థ నావిక్‌ను భారత్ సొంతగా అభివృద్ధి చేస్తుంది.  

Tags:    

Similar News