MLC Jeevan Reddy: దొంగలను పట్టుకోను చేతగాని పాలకులు

MLC Jeevan Reddy: అవినీతిని ప్రశ్నిస్తే రాహుల్‌పై రాజకీయంగా దెబ్బ కొట్టారు

Update: 2023-04-01 01:54 GMT

MLC Jeevan Reddy: దొంగలను పట్టుకోను చేతగాని పాలకులు

MLC Jeevan Reddy: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కక్షసాధింపు చర్యలతో లోక్ సభ సభ్యత్వంపై వేటు వేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అవినీతిని ప్రశ్నిస్తున్నాడని లోక్ సభలో లేకుండా చేయాలని కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఎప్పుడో గత శాసనసభ ఎన్నికలలో కర్ణాటకలో చేసిన వాక్యాలను తీసుకొని కేసు పెట్టారని, ఆ సమయంలో లలిత్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెట్టుబడులు దారి మళ్ళించాడని, నీరవ్ మోడీ ఐపీఎల్ కుంభకోణంలో పాల్గొని దేశం నుండి పారిపోయాడని ఆరోపించారు. మోడీని నిలదీయడానికి రాహుల్ గాంధీ రాజకీయ ఉపన్యాసంలో భాగంగా దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎందుకు ఉంటుందో అని రాహుల్ గాంధీ ప్రశ్నించారని గుర్తుచేశారు. దేశం వదిలి పారిపోయిన దొంగలను పట్టుకుని రాకపోగా ప్రశ్నించిన రాహుల్ గాంధీపై రాజకీయంగా దెబ్బకొట్టారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.

Tags:    

Similar News