టిక్‌టాక్ నటికి ఎమ్మెల్యే టికెట్
టిక్‌టాక్‌లో భారీ సంఖ్యలో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న సోనాలి ఫోగట్, బీజేపీ తరపున హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
టిక్‌టాక్‌లో భారీ సంఖ్యలో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న సోనాలి ఫోగట్, బీజేపీ తరపున హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.సోనాలీ సింగ్ టీవీ నటిగా రానిస్తున్నారు. ఓ ప్రముఖ చానల్ లో ఆమె పాపులర్ సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె... టిక్‌టాక్‌లో ఫాలో అయ్యే వారందరూ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. నామినేషన్ దాఖలు కోసం వారంతా ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీజేపీ తన టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.