గౌతమ్ గంభీర్ మిస్సింగ్‌ ..వెలిసిన పోస్టర్లు

Update: 2019-11-18 04:27 GMT
Gambhir skips pollution meet

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు మాస్కులు లేకుండా బయటకు రావడం లేదు. సుప్రీం కోర్టు కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రివాల్ సర్కార్ కాలుష్య నియంత్రణ కోసం వాహనదారులకు పలు నిబంధనలు విధించింది. వాహనాలు రాకపోకలపై సరి-బేసి విధానాన్ని అమలు చేశారు. సీఎంతో సహా కేబినెట్ మంత్రులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలియజేసిన సంగతి తెలిసిందే.

కాలుష్యంపై పిలుపునిచ్చిన సమావేశానికి బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ హాజరుకాలేదు. దీంతో గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేకాకుండా గౌతమ్ గంభీర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. గంభీర్ ఫొటోతో కూడిన ప్లెక్సీలు వేసి ఈ వ్యక్తిని ఎక్కడైనా చూశారా? ఆఖరి సారి ఇండోర్‌లో జిలేబిలు తింటూ కనిపించాడని ఉంది. ఢిల్లీ రాష్ట్రం మొత్తం అతని కోసం వెతుకుందని ఆ పోస్టర్లు, ప్లెక్సీల్లో రాసివుంది.

బీజేపీ ఎంపీ గంభీర్‌పై ఆమ్ఆద్మీపార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఢిల్లీ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గంబీర్ ఇతర రాష్ట్రానికి వెళ్లి జీలేబీలు తింటున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే వారిని తగిన గుణపాఠం చేబుతున్నావని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సోషల్ మీడియాలోను గంభీర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే ఇండోర్‌లో ఎంజాయ్‌ చేస్తున్నావు అంటూ నెటిజన్లు గౌతమ్ గంభీర్ పై విమర్శలు గురిపిస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ సందర్భంగా గౌతమ్‌ గంభీర్ ఇండోర్ వెళ్లాడు. అక్కడ  జతిన్ సప్రూ, లక్ష్మణ్, గంభీర్ కలసి జిలేబీలు తీసుకుంటున్న ఓ ఫోటోను గంభీర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.


ఇదే వార్తను ఇంగ్లీష్‌లో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News