ఆ చార్జీలు కేంద్రం 85 శాతం, రాష్ట్రం 15 శాతం భరించాలి..
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను తిప్పుతున్నారు. అయితే వారి చార్జీల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనపై మాత్రమే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని.. అయితే కార్మికుల దగ్గరి నుండి చార్జీలు వసూలు చేయాలనుకోవడం లేదని.. అసలు ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ చెప్పలేదు.. చార్జీలలో 85 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.. మిగిలిన 15 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి.
ఒకటి లేదా రెండు రాష్ట్రాలు మినహా, ఈ ప్రక్రియలో అందరూ మాకు సహకరిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా సోమవారం ఒక్కరోజే 2553 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని, 72 మంది మరణించారని పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,000 దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశంలో చెప్పారు. మరోవైపు రెడ్‌జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి లాక్ డౌన్ సడలింపులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.