మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది.

Update: 2020-03-28 10:43 GMT
Shyamkumar singh

మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది.మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే తౌనాజమ్ శ్యాంకుమార్ పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. అనంతరం మంత్రి కూడా అయ్యారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళింది. ఈ క్రమంలో మార్చి 18 న సుప్రీంకోర్టు మంత్రి శ్యాంకుమార్ సింగ్ ను శాసనసభలోకి ప్రవేశించకుండా నిరోధించింది. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు..

అనంతరం తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించారు. అయితే స్పీకర్ మాత్రం ఆయన రాజీనామాను పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ కింద శ్యాంకుమార్ ను అనర్హుడిగా ప్రకటించారు. 2017 లో కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికైన తరువాత బిజెపిలో చేరారని ఇది పార్టీ లైన్ కు విరుద్ధంగా పేర్కొంటూ స్పీకర్ ఆయనపై అనర్హత నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News