అమిత్ షా పై కీలక వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ

మోదీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

Update: 2019-12-18 12:49 GMT
Mamata Banerjee File Photo

మోదీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను తమ రాష్ట్రంలో అమలు చేసేదిలేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దేశాన్ని విద్వేషాలతో తగులబెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ లేని పౌరసత్వ సవరణ చట్టంపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తుందని, దేశంలో ఎవరూ పౌరసత్వం కోల్పోరని అంటూ వ్యక్తి గత సమాచారం ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. భారతీయజనతా పార్టీ ఇప్పుడు జనన దృవీకరణ పత్రాలు ఎందుకు అడుగుతుందని నిలదీశారు. పాన్ ఆధార్, వంటికి పనిచేయవని ఇప్పడు ఏం పని చేస్తాయన్నారు. బీజేపీ ఒంటెద్దు పోకడలతో ప్రవర్తిస్తుంది వ్యాఖ్యానించారు.

దేశంలో అక్రమ చోరబాట్ల దారుల కోసం ఎన్ని శిబిరాలను నిర్మిస్తారని అమిత్‌ షాను ప్రశ్నించారు. అమిత్‌ షాపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. అమిత్ షా బీజేపీకి మాత్రమే హోం మంత్రని దేశానికి కాదన్నారు, శాంతి భద్రతలను సవ్యంగా . బీజేపీ దేశ అభివృద్ధికీ పనిచేయడం లేదని, నాశనానికి పనిచేస్తుందని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వెనక్కితీసుకోవాలని, లేనిపక్షంలో పశ్చిమ బెంగాల్‌లో ఎలా అమలు చేస్తారో చూస్తానని హెచ్చరించారు.

ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై వెనక్కి తగ్గేది లేదని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని దేశంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తిన తరుణంలో అమిత్ షా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన ఇతర దేశం నుంచి వచ్చే శరణార్ధులకు భారత దేశ పౌరసత్వం కల్పించి స్తుందని, వలస వచ్చే వారికి దేశ పౌరసత్వం ఇచ్చేందుకు మోదీ సర్కార్ పూనుకుంటుందని తెలిపారు. ఈ చట్టంతో దేశంలో ఒక్కరికూడా జాతీయతా కోల్పోవడం జరగదని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు, విద్యార్ధులుకు విన్నవిస్తున్నా ఈ చట్టం వలన ఎలాంటి భయంల అవసరం లేదని, ఏఒక్కరు కూడా పౌరసత్వం కోల్పోరు చెప్పిన సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News