మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ ఆఘాడి ప్రభ్వుతం మరో కీలక హామీ నేరవేర్చింది.
శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ ఆఘాడి ప్రభ్వుతం మరో కీలక హామీ నేరవేర్చింది. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకుంది. రైతులకు రెండు లక్షల వరకు రుణమాపీ చేస్తామని ప్రకటించింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో ప్రకటించారు. 2019 సెప్టెంబరు 30 వరకు ఉన్న వ్యవసాయ రుణాలపై ఒక్కో రైతుకు గరిష్ఠంగా రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ రుణమాఫి పథకానికి జ్యోతిరావ్ పూలే పేరు పెడుతున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
అయితే బీజేపీ అభ్యంతం తెలిపింది. పూర్తి రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చి, షరతులు విధిస్తున్నారంటూ మండిపడింది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి ఆత్మహత్యలను నివారించవచ్చని అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ బీజేపీ నేత ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తో సహా సభ్యులందరూ సభనుంచి వాకౌట్ చేశారు.