బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం కన్నుమూత

Update: 2019-08-21 04:41 GMT

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌ (89) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన ఇటీవల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1930, జూన్‌ 2న జన్మించిన ఆయన మధ్యప్రదేశ్‌ లో బీజేపీ విస్తరించడానికి విశేష కృషి చేశారు. 2004 నుంచి 2005 వరకు బాబులాల్‌ మధ్యప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. 

Tags:    

Similar News