Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోయిందా.. చింతించకండి మళ్లీ ఇలా పొందండి..!

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోయిందా.. చింతించకండి మళ్లీ ఇలా పొందండి..!

Update: 2022-02-22 07:00 GMT

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోయిందా.. చింతించకండి మళ్లీ ఇలా పొందండి..!

Driving License: మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నట్లయితే చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో కూర్చొని డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్‌ని పొందవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడానికి, గుర్తింపు కార్డుగా డ్రైవింగ్‌ లైసెన్స్ పనిచేస్తుంది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్లయితే వాహనాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లడం సాధ్యంకాదు. ఈ పరిస్థితిలో మీరు కొన్ని సులభమైన పద్దతులని అవలంభిస్తే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్లయితే ముందుగా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఒకవేళ మీ డ్రైవింగ్ లైసెన్స్ పాతదై ఉంటే అది స్పష్టంగా లేకుంటే, చిరిగిపోయినట్లయితే డూప్లికేట్‌ కోసం అసలైన దాన్ని సమర్పించాలి. తర్వాత ఆన్‌లైన్‌లో డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర రవాణా శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ముందుగా రవాణా శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ అభ్యర్థించిన వివరాలను నింపండి. తర్వాత LLD ఫారమ్‌ను నింపండి.ఇప్పుడు దాని ప్రింట్ అవుట్ తీసుకోండి. దీంతో పాట అవసరమైన అన్ని పత్రాలను జత చేయండి. ఇప్పుడు ఈ ఫారమ్, అన్ని పత్రాలను RTO కార్యాలయానికి సమర్పించండి. ఇది ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన 30 రోజుల తర్వాత డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు వస్తుంది. 

Tags:    

Similar News