కోవిడ్‌తో 'లోక్‌పాల్‌' త్రిపాఠీ కన్నుమూత

కరోనా మహమ్మారి కారణంగా లోక్‌పాల్‌ సభ్యుడు జస్టిస్ ‌(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) మృతిచెందారు.

Update: 2020-05-03 02:00 GMT
lokpal member A K Tripathi (File photo)

కరోనా మహమ్మారి కారణంగా లోక్‌పాల్‌ సభ్యుడు జస్టిస్ ‌(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) మృతిచెందారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించింది. దాంతో రాత్రి తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. కాగా ఆయన కుమార్తె, అలాగే ఇంట్లో పని చేసే పని మనిషికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే వారు ఇప్పటికే వారు కోలుకున్నారని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన త్రిపాఠీ, ప్రస్తుత లోక్‌పాల్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు.

Tags:    

Similar News