చర్చ లేకుండానే 2020 ఆర్ధిక బిల్లుకు లోక్ సభ ఆమోదం

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావం లోక్ సభ ను తాకింది. 2020 ఆర్ధిక బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించింది.

Update: 2020-03-23 09:57 GMT
Loksabha

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావం లోక్ సభ ను తాకింది. 2020 ఆర్ధిక బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించింది. బిల్లుపై ఎటువంటి చర్చ లేకుండా వాయిస్ ఓటు ద్వారా ఫైనాన్స్ బిల్లు 2020 ను ఆమోదించింది. అనంతరం లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. కాగా సభ ప్రారంభం కాగానే అమరవీరులైన భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉభయ సభలు మౌనం పాటించాయి. అనంతరం 2020 లో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తరువాత సభను వాయిదా వేశారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా తమ పార్టీ ఎంపీలు పార్లమెంటు బడ్జెట్ సమావేశానికి హాజరుకారని తృణమూల్ కాంగ్రెస్, శివసేన రెండూ పార్టీలు ప్రకటించాయి . మరోవైపు కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పేదలకు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అధికర్ రంజన్ చౌదరి కోరారు. ఆయన సూచనలను కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు కూడా సమర్ధించడంతో సభలో కోలాహలం ఉంది.

Tags:    

Similar News