కాలుష్యం వల్ల తగ్గిపోతున్న మానవుల ఆయుర్ధాయం

ప్రపంచంలో రోజు రోజుకు సాంకేతికత పెరుగుతున్నాకొద్ది కాలుష్యం కూడా పెరుగుతుంది. దీని ద్వారా మనుషులు, పశువులు, పిచ్చుకలు, జీవరాసులన్నింటి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. సగటున జీవించాల్సినంత కాలం కూడా ఇప్పటి కాలంలో బతకడం కష్టంమవుతుంది.

Update: 2019-11-01 12:18 GMT

ప్రపంచంలో రోజు రోజుకు సాంకేతికత పెరుగుతున్నాకొద్ది కాలుష్యం కూడా పెరుగుతుంది. దీని ద్వారా మనుషులు, పశువులు, పిచ్చుకలు, జీవరాసులన్నింటి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. సగటున జీవించాల్సినంత కాలం కూడా ఇప్పటి కాలంలో బతకడం కష్టంమవుతుంది. ఈ కాలుష్యం ద్వారా ఓజోన్ పొర కూడా పలుచబడి సూర్యరశ్మి నేరుగా భూమిపైన పడడంతో నేలతల్లి కూడా నెర్రెలుబారుతుంది. ఈ కాలుష్యం ద్వారా వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.

ప్రపంచంలో ఉన్న దేశాలతో పోల్చకుంటే భారత దేశం కాలుష్యంలో రెండో స్థానంలో ఉందని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఇపిఐసి) కొత్త అధ్యయనంలో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచికలకు (డబ్ల్యూహెచ్‌ఓ) భారతదేశం చాలా దూరంగా ఉంది. అంటే 48 కోట్లకు పైగా భారతీయులు అంటే దాదాపు 40% మంది ప్రజలు వారి ఏడు సంవత్సరాల ఆయుర్దాయ కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. 2013-17లో చేసిన రిజిస్ట్రేషన్ సర్వేలో భారతదేశంలో ఆయుర్దాయం 2011 లో 67 సంవత్సరాల నుండి 69 సంవత్సరాలకు మెరుగుపడిందని తేలింది. కాని పంజాబ్, చండీగ, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రమాదకరమైన వాతావరణ కాలుష్యం వలన వారి సగటు ఆయుర్దాయం ఏడు సంవత్సరాలు తగ్గుతుంది.

ఈ ప్రాంతంలో 1998 నుండి 2016 వరకు 72 శాతం కాలుష్యం పెరగడం ద్వారా ఇలాంటి ఫలితాలు బయటికి వస్తున్నాయి. అంతే కాక కాలుష్యం కారణంగా 7 నుంచి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుర్దాయం కోల్పోయే ప్రమాదం ఉన్న 14 నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటిగా ఉందని epic అధ్యయనంలో తెలిపింది. WHO మార్గదర్శకాలకు భారతదేశం కట్టుబడి ఉంటే, పరిస్థితి మెరుగుపడవచ్చని వారి అధ్యయనం కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మార్గదర్శకం 10 µg / m3కు రేణువుల కాలుష్యాన్ని తగ్గించడం వల్ల భారతదేశం అంతటా సగటున ఆయుర్దాయం 4.3ఏళ్ల కయసును పెంచుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా భారత్ ఈ ఏడాది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ) ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం విజయవంతమైతే సగటు భారతీయుడి ఆయుర్దాయం సుమారు 1.3 సంవత్సరాలు, ఇండో-గాంగెటిక్ మైదానంలో ఉన్నవారికి 2 సంవత్సరాల ఆయుర్ధాయం పెరగవచ్చని తెలిపారు.



Tags:    

Similar News