Shivraj Singh Chouhan: గ్రామీణ ప్రాంతాల్లో యువతను గుర్తించి ప్రోత్సహించాలి.. జనంలోంచి నాయకులు రావాలి
* ప్రతిభావంతులైన వారిని వెలుగులోకి తీసుకురండి
జనంలోంచి నాయకులు రావాలి
Bhopal CM Shivraj Singh Chouhan: భారత దేశ నవ నిర్మాణంలో యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. విపక్షాలు ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ప్రజానీకాన్ని గందరగోళ పరిస్థితులకు గురిచేస్తున్న విషయాన్ని గుర్తించి వారిలో అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. మారు గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో యువమోర్చా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావాలన్నారు. గ్రామీణ యువతలో నాయకత్వ లక్షణాలను గుర్తించి పార్టీ కార్యకలాపాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రజల్లోంచి నాయకులను తీర్చిదిద్ది ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించేందుకు యువమోర్చా బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.