పదవీ విరమణ చేయనున్న రంజన్‌ గోగోయ్‌

Update: 2019-11-15 06:13 GMT
Ranjan Gogoi

భారత సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శుక్రవారం ప్రత్యేకంగా తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. నవంబర్ 17వ తేదీన రంజన్‌ గొగోయ్‌ పదవీ కాలం ముగుస్తుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ గొగొయ్ కు వీడ్కోలు పలకనున్నారు. రంజన్‌ గొగోయ్‌ పదవీ విరమణ అనంతరం గొగోయ్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే (63) సుప్రీం కోర్డు న్యాయముర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రంజన్‌ గొగోయ్‌ తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్‌ కేసారి నోటీసులు జారీ చేశారు

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అసోం రాష్ట్రాకి చెందిన వ్యక్తి. 1978లో గొగోయ్‌ బార్‌ కౌన్సిల్‌లో చేరారు. లాయర్‌గా గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. జస్టిస్‌ గొగోయ్‌ 2012 ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి చెందిన పదోన్నతి పొందారు. భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కొనసాగారు.

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ విరమణ అనంతరం జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే (63) ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ బోబ్డే 19 సంవత్సరాలు బాంబే హైకోర్టులో పనిచేశారు. రెండేళ్లకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. తర్వాత 2013 ఏప్రిల్‌ 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆర్టికల్‌ 370 కేసుతోపాటు పలు కీలక కేసులు విచారణ చేశారు. 

Tags:    

Similar News