నెత్తిన సద్ది.. కళ్ళనిండా కన్నీళ్లు.. మధ్యలోనే భర్త మృతి..
నెత్తిన సద్ది.. కళ్ళనిండా కన్నీళ్లతో వందల కిలోమీటర్లు నడిచిందా బహుదూరపు బాటసారి.. ఈ సుదూర ప్రయాణంలో ఆ వలసజీవి భర్త అసువులు బాసాడు.
నెత్తిన సద్ది.. కళ్ళనిండా కన్నీళ్లతో వందల కిలోమీటర్లు నడిచిందా బహుదూరపు బాటసారి.. ఈ సుదూర ప్రయాణంలో ఆ వలసజీవి భర్త అసువులు బాసాడు.. చనిపోయిన చోటే భర్త అంత్యక్రియలు చేసి.. ఇద్దరు పిల్లలతో నడకదారి పట్టిన ఇంటికి చేరుకుందా మహిళ.. ఆమె కన్నీటి గాధ.. ఒకసారి చూద్దాం.. బీహార్ కు చెందిన ఓ వలసకూలీ సొంతఊళ్ళో పనులు లేకపోవడంతో పొట్టకూటికోసం వేరే రాష్ట్రం వలసవెళ్లాడు.. అతని వెంట భార్యాపిల్లల్ని కూడా తీసుకువచ్చాడు.. అయితే కరోనా మహమ్మారి వారి జీవితాన్ని కాటువేసింది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వారి ఇంట పెనువిషాదాన్ని నింపింది. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతఊరికి బయలుదేరారు వారంతా.. అయితే వాహనాలు ఏవి తిరగకపోవడంతో కాలినడకనే ఉత్తరప్రదేశ్- ఢిల్లీ సరిహద్దు గుండా బీహార్ కు వెళుతున్నారు.
ఈ క్రమంలో మార్గంమధ్యలో మహిళ భర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయినా నడక కొనసాగించడంతో మరణించాడు. దాంతో ఆ మహిళ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గుండెలవిసేలా రోదించింది. చేసేదేమి లేక ఉబికివస్తున్నకన్నీళ్లను అదుపుచేసుకొని భర్త మృతదేహాన్ని చనిపోయిన చోటే ఇతరుల సహాయంతో పూడ్చిపెట్టింది. ఇద్దరు పిల్లల కోసం మనుగడ సాగించేందుకు అనంతరం నడక కొనసాగించింది.. దారిపొడవునా కొంతమంది ఇచ్చే ఆహారంతో కడుపునింపుకుంటూ వందల కిలోమీటర్లు నడిచి ఎట్టకేలకు ఇంటికి చేరుకుంది. ఆమె దీన గాధను విన్న పలువురు నెటిజన్ల గుండె తరుక్కుపోయింది.