కారులో గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యాడు.. తీరా చూస్తే.. వరద నీటిలో చిక్కుకుపోయిన జంట

ఇటీవల గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ఎంతోమంది ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎక్కువగా జరిగాయి. తాజాగా కేరళలో ఒక జంట కారులో వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్‌ని ఫాలో అయ్యారు.

Update: 2025-07-25 01:00 GMT

ఇటీవల గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ఎంతోమంది ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎక్కువగా జరిగాయి. తాజాగా కేరళలో ఒక జంట కారులో వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్‌ని ఫాలో అయ్యారు. తీరా చూస్తే అది వరద ప్రవాహంలోకి వెళ్లిపోయి కారు చిక్కుకుపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేరళలో కొట్టాయంలోని కడుతురుతిలో జోసఫ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్లాడు. అయితే గూగుల్ మ్యాప్ సహాయంతో ముందుకు వెళుతుండగా ఒక చోట వరద నీటిలో చిక్కుకుపోయారు. కారు ముందు భాగం మొత్తం నీటిలో మునిగిపోయింది. అయితే ఇది గమనించిన స్థానికులు చాలా సేపు కష్టాలు పడిన తర్వాత ఆ జంటను బయటకు తీసారు. గూగుల్ మ్యాప్ చూసుకుంటూ ముందుకు వచ్చామని..అసలు ఇక్కడ నీళ్లు ఉన్నట్టు తెలియలేదని వారు చెప్పారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే గూగుల్ మ్యాప్‌ ని ఫాలో అవుతున్నా.. కాస్త ముందు ఏమందో తెలుసుకుని డ్రైవ్ చేయాలని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News