Sophia Qureshi Salary: కల్నల్ సోషియా ..మేడమ్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..చదువు నుంచి జీతభత్యం గురించి పూర్తి వివరాలివే.!

Update: 2025-05-08 01:50 GMT

Sophia Qureshi Salary: కల్నల్ సోఫియా ఖురేషీ..ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియాలో వినిపిస్తున్న పేరు. పాక్ లో ప్రవేశించి అక్కడున్న ఉగ్రస్థావరాలను ఎలా మట్టుబెట్టామనేది కల్నల్ సోఫియా ఖురేషీ ప్రపంచానికి వివరించారు. అప్పటి నుంచి ఆమె పేరు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఆపరేషన్ సింధూర్ గురించి భారతసైన్యం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇద్దరు మహిళా అధికారులు కూడా పాల్గొన్నారు. అందులో ఒకరు సోఫియా ఖురేషి. మరొకరు వ్యోమికా సింగ్. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పాకిస్తాన్, పిఓకెలలో 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేసిన తీరు, పహల్గామ్ దాడి బాధితులకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా, మొత్తం దేశం కూడా గర్వంతో నిండిపోతుంది. ఆపరేషన్ సింధూర్ విజయంలో, ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్నల్ సోఫియా ఖురేషి.

ఆపరేషన్ సిందూర్ సమయంలో కల్నల్ సోఫియా గురించి చర్చ జరిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి కల్నల్ సోఫియా 'బ్రీఫింగ్' కోసం ప్రెస్ ముందు హాజరయ్యారు. ఆమె ప్రెస్ మీటింగ్ ఇవ్వడం చూసి, గుజరాత్‌లోని వారి కుటుంబం గర్వంతో నిండిపోయింది.వడోదర నివాసి అయిన కల్నల్ సోఫియా, ఆర్మీ ఆఫీసర్ కావడానికి తన పీహెచ్‌డీ, లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మహ్మద్ సంజయ్ ఖురేషి నగరంలోని తండల్జా ప్రాంతంలో నివసిస్తున్నారు. తన సోదరి సైన్యంలో ఉన్న తన తాత, తండ్రి నుండి ప్రేరణ పొందిందని సంజయ్ అన్నారు. "దేశభక్తి మా రక్తంలోనే ఉందని చెప్పారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, సోఫియా వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి, తరువాత బయోకెమిస్ట్రీలో ఎంఎస్సి చేసింది. ఎందుకంటే ఆమె ప్రొఫెసర్ కావాలనుకుంది" అని సంజయ్ అన్నారు. ఇంతలో,షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా భారత సైన్యంలో ఎంపికయ్యిది. ఆర్మీలో చేరడానికి తన PhD, భోధనా వృత్తిని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

సోఫియా భర్త కూడా భారత సైన్యంలోనే ఉన్నారు. అతని పేరు మేజర్ తాజుద్దీన్ ఖురేషి. సోఫియా భర్త భారత సైన్యంలోని మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి. కల్నల్ సోఫియా 1997లో మాస్టర్స్ డిగ్రీ చేసి, ఆ తర్వాత ఆర్మీ సిగ్నల్ కార్ప్స్‌లో చేరారు.2016లో, కల్నల్ సోఫియా విదేశాలలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిణిగా చారిత్రాత్మక ఘనతను సాధించారు. ASEAN ప్లస్ దేశాల బహుళజాతి సైనిక విన్యాసాలు 'ఫోర్స్ 18'లో పాల్గొన్న 18 దేశాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్ అయ్యారు. అదనంగా 2006లో UN శాంతి పరిరక్షక కార్యకలాపాలలో భాగంగా ఆరు సంవత్సరాల పాటు కాంగోకు మోహరించారు.

కల్నల్ సోఫియా మూల జీతం నెలకు దాదాపు రూ.130600 నుండి రూ.215900 వరకు ఉంటుంది. వారికి కరువు భత్యం, ప్రత్యేక భత్యాలు కూడా లభిస్తాయి. కల్నల్ నెలవారీ జీతం రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News