Rahul Mamkootathil: నటి ఆరోపణలు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్‌

Rahul Mamkootathil: కేరళ కాంగ్రెస్‌లో ఇటీవల ఒక నటి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.

Update: 2025-08-25 06:14 GMT

Rahul Mamkootathil: నటి ఆరోపణలు.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన కాంగ్రెస్‌

Rahul Mamkootathil: కేరళ కాంగ్రెస్‌లో ఇటీవల ఒక నటి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామాల మధ్య పార్టీ ఎమ్మెల్యే రాహుల్ మామకుటత్తిల్ను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

నటి చేసిన ఆరోపణలు

నటి రీని జార్జ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – తాను ఒక ప్రముఖ పార్టీ యువ నేత చేత మూడేళ్లుగా లైంగిక వేధింపులకు గురయ్యానని ఆరోపించారు. ఈ విషయం పలుమార్లు పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన రాలేదని వాపోయారు. అయితే ఆమె నేరుగా రాహుల్ మామకుటత్తిల్ పేరును ప్రస్తావించలేదు.

రాజకీయ దుమారం

నటి చేసిన ఆరోపణల తరువాత బీజేపీ, సీపీఎం శ్రేణులు రాహుల్ ప్రమేయాన్ని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టాయి. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

రాహుల్ స్పందన

రాజీనామా తరువాత రాహుల్ మామకుటత్తిల్ ఇలా అన్నారు:

‘‘నాపై వచ్చిన ఆరోపణలపై పార్టీ పెద్దలతో చర్చించాను. వారెవరూ రాజీనామా చేయమని చెప్పలేదు.

ఆ నటి నా స్నేహితురాలు, కానీ ఆరోపణలు చేసిన వ్యక్తి నేను కాదని నమ్ముతున్నాను.

నేను ఎటువంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదు.’’

అయితే విమర్శలు ఆగకపోవడంతో చివరకు కాంగ్రెస్ పార్టీ కఠిన నిర్ణయం తీసుకుని ఆయనను సస్పెండ్ చేసింది.

Tags:    

Similar News