Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత

భక్తులకు అలర్ట్ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత ఉఖీమఠ్‌కు కేదారేశ్వరుడు శీతాకాలం నేపథ్యంలో భాయ్‌దూజ్ పండుగ రోజున.. శాస్త్రోక్తంగా టెంపుల్‌ను మూసివేయడం ఆనవాయితీ ఉబీమఠ్‌కు బయలుదేరిన కేదారేశ్వరుడు

Update: 2025-10-23 06:20 GMT

Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత

ఉత్తరఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్‌దూజ్ పండుగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీ వస్తున్నది. ద్వారాల మూసివేత కార్యక్రమానికి ముందు ఆలయాన్ని వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా, వైభవంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సైతం ఆలయానికి చేరుకుని ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నారు.


వేకువ జామున 4 గంటలకు ఆలయ తలుపులు మూసివేసే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు, ఆచారాలు ముగిసిన అనంతరం ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. ద్వారబంధనం పూర్తి కాగానే.. బాబా కేదారేశ్వరుడి పంచముఖి డోలి యాత్ర ప్రారంభమై ఉఖీమఠ్‌కు బయలుదేరింది. ఈ ఆరు నెలల శీతాకాలపు విరామ సమయంలో.. బాబా కేదారేశ్వరుడు ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజలు అందుకోనున్నాడు. కేదార్‌నాథ్‌లో అత్యంత చలి, మంచు కారణంగా ఆలయాన్ని మూసివేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది..


Tags:    

Similar News