హెల్మెట్‌ లేదు చలానా కట్టండి లారీ డ్రైవర్‌కు నోటీసులు !

ద్విచక్రవాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలి లేదంటే జరిమానా విధిస్తారు

Update: 2019-11-06 04:07 GMT
Lorry driver

కొత్తగా వచ్చిన మోటారు వాహన చట్టం వాహనదారులకు బెంబేలెత్తిస్తుంది. కాగా.. ద్విచక్రవాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలి లేదంటే జరిమానా విధిస్తారు. అయితే ఓ లారీ డ్రైవర్ కు హెల్మెట్ ధరించలేదని జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ లో చోటుచేసుకుంది. 409 లారీలో వెళ్తున్న డ్రైవర్‌ నజీర్‌ ఇంటికి నోటీసులు పంపారు పోలీసులు. దాండేలి నగరంలో ఉంటున్న నజీర్ కు నోటీసులు పోలీసులు పంపడంతో ఆందోళనకు గురైయ్యాడు.

నజీర్ వాటిని చూస్తే 409 వాహనం నడిపిన నజీర్ హెల్మెట్ ధరించని కారణంగా రూ.500 జరిమానా చెల్లించాలని వాటిలో ఉంది. పోలీసులు నజీర్ కు పంపిన నోటీసులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. అయితే ఇలాంటి వాటిపై నోటీసులు పంపే ముందు పోలీసుల పరిశీలించుకోవాలని ద్విచక్రవాహనం నడిపే వారికి కాకుండా లారీ నడిపే వ్యక్తికి చలానా విధించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Tags:    

Similar News