కోర్టు తీర్పు వచ్చిన గంటల్లోనే... 17 మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి

Update: 2019-11-13 12:00 GMT
Karnataka Disqualified MLA

కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ కూటమి కూలిపోయి యాడ్యురప్ప సర్కార్ అధికారం చేపట్టింది.

అయితే అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయానే ఫైనల్ అని తేల్చి చేప్పింది. అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల వరకూ పోటీ చేయడానికి అనర్హులని నిర్ణయించారు. దీంతో వారు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు స్పీకర్ ఆదేశాలు కొట్టివేసింది. ఎమ్మెల్యేలు పోటీ చేయవచ్చని వారికి అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం 17 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలకు ఇటీవలే నొటీఫికేషన్ వెలువరించింది. డిసెంబర్ 5న ఉపఎన్నికలు జరగనున్నాయి.

కోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే వారు పార్టీ మార్పుకు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలు అంతా కలిసి బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఉపముఖ‌్యమంత్రి అశ్వత్ నారాయణ్ వెల్లడించారు. సుప్రీంతో కోర్టు తీర్పు అనంతరం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు నిర్ణయిచుకుంన్నారని, అందుకు అధిష్టానం కూడా అంగీకరించిందని గురువారం ఉదయం అనర్హత ఎమ్మెల్యేలు సీఎం యోడ్డియురప్ప సమక్షంలో పార్టీలో చేరుతారని చెప్పారు. ఉపఎన్నికల్లో వారికి టెకెట్లు ఇచ్చే అంశంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని అశ్వత్ నారాయణ్ తెలిపారు. 

Tags:    

Similar News