కావేరి జల వివాదంపై నేడు కర్ణాటక బంద్… 144 సెక్షన్ అమలు
Karnataka: డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన ఆందోళనకారుల అరెస్ట్
కావేరి జల వివాదంపై నేడు కర్ణాటక బంద్… 144 సెక్షన్ అమలు
Karnataka: తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కన్నడ రైతుల ఆందోళన తీవ్రతరమయ్యింది. కన్నడ రైతు సంఘాలు నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు ఇచ్చాయి. బంద్ పిలుపుతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్ళు మూత పడ్డాయి. బెంగళూరు, మైసూరు లాంటి పెద్ద నగరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డెక్కిన ఆందోళనకారులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. మాండ్యాలో నిరసనకారులు వినూత్న ఆందోళన చేపట్టారు. నాలుక చాచిన స్టాలిన్ ఫొటోకు రక్త తర్పణం చేశారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కర్ణాటక బంద్‌కు బీజేపీ, జేడీఎస్ మద్దతు ప్రకటించాయి.