Kapil Sibal: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్
Kapil Sibal: నాలుగో సారి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక
Kapil Sibal: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్
Kapil Sibal: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కపిల్ సిబల్ కు 1,066 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్ధి సీనియర్ అడ్వకేట్ ప్రదీప్ రాయ్ కు 689 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది డాక్టర్ అదిష్ సి.అగర్వాలాకు 296 ఓట్లు వచ్చాయి. తాజాగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఆరుగురు అభ్యర్ధులు పోటీ చేశారు. కపిల్ సిబాల్ విజయం సాధించారు. కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. తొలిసారిగా 1995, 1997, 2001లోనూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షపదవిలో కొనసాగారు.