ఎర్రకోట ఎక్కిన జస్ ప్రీత‌ సింగ్ అరెస్ట్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ సందర్భంగా ఢిల్లీ లోఎర్రకోటపైకి ఎక్కిన అందోళన చేసిన జస్ప్రీత‌ సింగ్ అరెస్ట్

Update: 2021-02-23 03:27 GMT

ఇమేజ్ సోర్స్: publicvibes

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్స వేడుకల సందర్భంగా ఢిల్లీలో రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో ఎర్రకోట పైకి ఎక్కిన ఆందోళనకారుడు జస్‌ప్రీత్‌ సింగ్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జస్ ప్రీత్ సింగ్ తో పాటు ఎర్రకోట ముట్టడికి పాల్పడిన మరో 20 మంది ఫొటోలను ఢిల్లీ పోలీసులు ఈ నెల 20న విడుదల చేశారు. ఇందులో ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌కు చెందిన జస్‌ప్రీత్‌ సింగ్‌ ఫొటో కూడా ఉంది. జనవరి 26 హింసాకాండలో అతడు ఎర్రకోట ప్రాకారాలపైకి ఎక్కి ఇనుప రాడ్‌ను పట్టుకుని పలు సంజ్ఞలు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేశారు.

కాగా, ఎర్రకోట వద్ద చెలరేగిన హింసాకాండ ఘటనలో మోస్ట్ వాటెండ్‌‌గా చెబుతున్న మనీందర్ సింగ్ అనే వ్యక్తిని గత వారంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్టు చేసింది. స్వరూప్ నగర్‌లోని అతని ఇంట్లో 4.3 అడుగుల కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొద్ది నెలలగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల స్థితి గతులను మార్చేందుకు ఈ చట్టాలు ఉపకరిస్తాయని కేంద్రం చెబుతుండగా... ఈ చట్టాలతో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని రైతులు వాపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలే రైతులను ఇలా తప్పుదోవ పట్టించాయని కేంద్రం మొదటినుంచి విమర్శిస్తోంది. రైతుల ఆందోళనలతో ఓ మెట్టు దిగిన కేంద్రం... ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను పక్కనపెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ రైతులు మాత్రం ఆ చట్టాలను రద్దు చేసేదాకా ఢిల్లీ సరిహద్దులను వీడేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమాన్ని ఎలా డీల్ చేయాలన్న విషయంపై బీజేపీ ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది.

Tags:    

Similar News