కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ముర్ము కీలక వ్యాఖ్యలు

జమ్మూ కశ్మీర్‌క అధికరణ 370 రద్దు తర్వాత కేంద్ర సర్కార్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది.

Update: 2019-11-14 10:43 GMT
jammu kashmir lieutenant governor

కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌ చందర్‌ ముర్ము ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌క అధికరణ 370 రద్దు తర్వాత కేంద్ర సర్కార్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇటీవలే అక్కడి గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేసి కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌కు కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా గిరీశ్‌ చంద్ర ముర్ము, లద్ధాఖ్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఆర్‌కే మాథూర్‌ ప్రమాణస్వీకారం చేశారు.

తాజాగా కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ గిరీశ్‌ చందర్‌ ముర్ము పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్దమవుతోందని తెలిపారు. త్వరలోనే ఎన్నికలు ఉంటాయిని అధికారులతో చెప్పారు. జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రజలు సహకరించాలని కోరారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మూర్ము చేసిన వ్యాఖ్యలకు అధిక ప్రాధాన్యత సంచరించుకుంది. 2018 నుంచి జమ్ముకశ్మీర్ లో గవర్నర్‌ పాలనే సాగుతోంది. స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పీఓకేలో కూడా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో తన సూదీర్ఘ ప్రసంగంలో తెలిపిన విషయం తెలిసిందే 

Tags:    

Similar News