One Nation, One Election Bill: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

Jamili Elections: లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ ఘేఘ్ వాల్ మంగళవారం ప్రవేశపెట్టారు.

Update: 2024-12-17 06:51 GMT

One Nation, One Election Bill: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

Jamili Elections: లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ ఘేఘ్ వాల్ మంగళవారం ప్రవేశపెట్టారు. లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు బిల్లును ప్రవేశ పెట్టారు. జమిలి ఎన్నికల(One Nation, One Election Bill)కు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరో బిల్లును ప్రవేశ పెట్టింది కేంద్రం. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరో బిల్లును కూడా కేంద్ర మంత్రి ప్రవేశ పెట్టారు.

వ్యతిరేకించిన కాంగ్రెస్

లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టడాన్ని కాంగ్రెస్(Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల కాల వ్యవధిని కుదించడం రాజ్యంగ విరుద్దమని ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారి చెప్పారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజ్యాంగ స్పూర్తిని ఈ బిల్లు దెబ్బతీస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూస్తోందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. దేశాన్ని పక్కదోవ పట్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎస్పీ ఆరోపించారు.జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకె, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్ సీ పీ (శరద్ పవార్), ముస్లిం లీగ్, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి.తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ అనుకూలమని ప్రకటించాయి.బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏకు 293 మంది బలం ఉంది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులున్నారు.

జేపీసీకి బిల్లును పంపుతాం: అమిత్ షా

జేపీసీకి పంపడానికి తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.ఈ బిల్లును జేపీసీకి పంపి విస్తృత చర్చ జరగాలని ప్రధాని చెప్పారని మంత్రి గుర్తు చేశారు.సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక తర్వాత మళ్లీ బిల్లు తీసుకువస్తామని ఆయన అన్నారు.

Tags:    

Similar News