తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. బరిలోకి 2 వేల ఎద్దులు, 730 మంది యువకులు

Update: 2020-01-15 07:15 GMT
తమిళనాడులో జోరుగా జల్లికట్టు

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మధురై జిల్లా అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలను తిలకించడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు. వాటిని అదుపుచేయడానికి 730 మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు.

అవనియాపురంలో ఉదయం 8గంటలకే జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ న్యాయమూర్తి, మధురై మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పోటీలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రప్రజలంతా ఈ పోటీలను వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అందుబాటులో ఉంచారు.

Tags:    

Similar News