మరికొన్ని గంటల్లో మూగబోనున్న విక్రమ్ ల్యాండర్!

మరికొన్ని గంటల్లో మూగబోనున్న విక్రమ్ ల్యాండర్ మరికొన్ని గంటల్లో మూగబోనున్న విక్రమ్ ల్యాండర్

Update: 2019-09-20 10:03 GMT

దేశప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న విక్రమ్ ల్యాండర్ కధ ముగిసినట్టే కనిపిస్తోంది. చంద్రుని కక్షలో సాధారణంగా పనిచేస్తున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ మరికొన్ని గంటల్లో మూగబోనున్నట్టు తెలుస్తోంది. చంద్రయాన్ - 2లో భాగంగా సెప్టెంబర్ 7న చంద్రుడి వద్దకు చేరింది ల్యాండర్.. అయితే ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది. దీనితో కనెక్టివిటీ జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.. రేయింబవళ్లు పరిశోధనలు జరిపారు.. చివరికి అమెరికా నాసా సహాయం తీసుకున్నా ఫలితం లేకపోయింది. సెప్టెంబర్ 20 లోపు డెడ్ లైన్. అప్పటి వరకు విక్రమ్ ల్యాండర్ విజయవంతం కాకపోతే.. నిరుపయోగంగా మారిపోతుందన్నారు శాస్త్రవేత్తలు. నేటితో గడువు పూర్తవుతుంది. గురువారం ఇస్రో భావోద్వేగ ట్వీట్ చేసింది. 'మద్దతు ఇచ్చిన దేశప్రజలందరికీ ధన్యవాదాలు. మీ సపోర్టుతో మరింత ముందుకు వెళతాం.' అని పేర్కొంది.

Tags:    

Similar News