2 గంటలు.. 73 రైళ్లు.. లక్ష 49 వేల టికెట్లు బుక్ : రైల్వే శాఖ
కరోనా సంక్షోభం, లాక్డౌన్ మధ్య జూన్ 1 నుండి రైల్వే శాఖ 200 రైళ్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా సంక్షోభం , లాక్డౌన్ మధ్య జూన్ 1 నుండి రైల్వే శాఖ 200 రైళ్లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లలో ప్రయాణాల కోసం బుకింగ్ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. రెండు గంటల్లో 73 ప్రత్యేక రైళ్ల మొదటి సెట్‌కు 1 లక్ష 49 వేల 025 టికెట్లు బుక్ చేసుకున్నట్లు రైల్వే తెలిపింది. అయితే, ప్రజలు ఉదయం బుకింగ్ చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా అందరూ సైట్ ఓపెన్ చెయ్యడంతో ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ పనిచేయలేదని తెలిపారు. ఇదిలావుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లను నడపబోతున్నామని రైల్వే మంత్రి పియూష్ గోయల్ చెప్పారు.
రైల్వే స్టేషన్‌లోని దుకాణాలను కూడా అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఈ దుకాణాల ద్వారా ప్రయాణికులు తమకు కావలసిన వస్తువులను తీసుకోవచ్చని అన్నారు. కాగా ఉదయం 10 గంటలకు రైల్వేకు చెందిన ఐఆర్‌సిటిసి సైట్ పనిచేయడం లేదని కొందరు.. డబ్బులు కట్ అయినా.. టికెట్ బుకింగ్ కాలేదని మరికొందరు ఐఆర్‌సిటిసి దృష్టికి తీసుకువచ్చారు. దాంతో స్పందించిన రైల్వే.. వెబ్‌సైట్ పనిచేస్తుందని.. టికెట్లు బుక్ అవుతున్నాయని ఐఆర్‌సిటిసి ట్వీట్ చేసింది.