మహారాష్ట్ర : అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎట్టకేలకు మహారాష్ట్ర ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు.

Update: 2019-11-27 08:11 GMT
Ajit Pawar

ఎట్టకేలకు మహారాష్ట్ర ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. బలపరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తాను మనస్సు మార్చుకున్నానని స్పష్టం చేశారు. అందుకే తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మహారాష్ట్రలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఎప్పటికీ ఎన్సీపీతోనే ఉన్నానని వ్యాఖ్యానించారు.

అయితే కొత్తగా ఏర్పాడనున్న ప్రభుత్వంలో తన పదవుల గురించి పార్టీ నిర్ణయిస్తుందని తేల్చిచెప్పారు. పార్టీ నుంచి తనను ఎవరూ బహిష్కరించలేదని అజిత్ పవార్ అన్నారు. మరోవైపు శివసేన సీనియర్ నేత ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ నూతన ఏర్పడనున్న ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. అజిత్ పవార్ తన పొరపాటును ఒప్పుకున్నారని, ఈ విషయం శరద్ పవార్ ను కలిసి మాట్లాడరని రౌత్ వెల్లడించారు.

మంగళవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని, రహాస్య ఓటింగ్ కాకుండా బహిరంగంగా ఓటింగ్ నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంగా మూడు రోజుల క్రితం ప్రమాణం చేసిన ఫడ్నవీస్ బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. అంతకుముందు తన డిప్యూటీ సీఎం పదవికీ అజిత్ రాజీనామా చేశారు. శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్‌ కూటమికి ఉద్ధవ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి డోర్లు తెరుచుకున్నాయి. గురువారం సీఎంగా ఉద్దవ్ ప్రమాణం చేయనున్నారు. 

Tags:    

Similar News