Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం

* దట్టమైన పొగమంచు వ్యాపించడంతో అందని సిగ్నల్ * తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆర్మీ పైలెట్లు

Update: 2021-09-21 12:00 GMT

జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం(ఫోటో-ది హన్స్ ఇండియా)

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌కు సమీపంలోని శివ్ గఢ్ ధార్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలెట్లతో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌కు ఆకాశంలో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో సిగ్నల్ సరిగా కనిపించక పోవడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని రెస్క్యూ బృందాలు బయటకు తీసుకొచ్చారు వారిని ఆస్పత్రికి తరలించారు

Tags:    

Similar News