అగ్ని–2 చీకట్లో సైతం విజయవంతం

Update: 2019-11-17 03:16 GMT
Agni-II

భారత్ మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని 2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. మొదటిసారి రాత్రిపూట ఈ పరీక్షను నిర్వహించారు. ఒడిశా తీరంలోని బాలాసోర్ డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలోని ఐటీఆర్ కాంప్లెక్స్ 4 నుంచి అగ్ని 2 క్షిపణిని పరీక్షించామని రక్షణ శాఖ వెల్లడించింది. రాత్రి సమయంలోనూ ఈ క్షిపణి లక్ష్యాలను చేదిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్షిపణికి 2 వేల కి.మి దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం ఉందిని వెల్లడించారు.

దీని బరువు 17టన్నులు , మరో వేయి కీలోలా పేలోడ్ ను తీసుకెళ్లగల సామర్ధ్యం ఉందని చెప్తున్నారు. 1999 ఏప్రిల్‌ 11న అగ్ని 2 క్షిపణిని పరీక్షించారు. భూమిపై ఉన్న 2వేల కిలోమిటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని -2 క్షిపణి 2018లో భారత సైన్యంలో చేరింది. అగ్ని క్షిపణులను పగటి సమయంలోనే ప్రయోగించేవే శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇప్పటి నుంచి రాత్రి వేళల్లో కూడా లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణిని భారత శాస్త్రవేత్తలు తయారు చేశారు. 

Tags:    

Similar News