రుతుపవనాలు ఇంకా కేరళకు చేరుకోలేదు : వాతావరణ శాఖ

రుతుపవనాలు ఇంకా కేరళకు చేరుకోలేదని ఆదివారం వాతావరణ శాఖ పేర్కొంది.

Update: 2020-05-31 14:42 GMT

రుతుపవనాలు ఇంకా కేరళకు చేరుకోలేదని ఆదివారం వాతావరణ శాఖ పేర్కొంది.మేము దీనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం. మోహపాత్రా తెలిపారు. జూన్ 1 తర్వాత రుతుపవనాలు రావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చేసిన ముందస్తు సూచనకు అనుగుణంగా ఉన్నామన్నారు. అంతకుముందు, నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ శనివారం పేర్కొంది. వాస్తవానికి, దక్షిణ తీర ప్రాంతాలైన కేరళ, లక్షద్వీప్ ప్రాంతాలలో మూడు రోజులుగా వర్షం పడుతోంది.

ఈ రోజు ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌లో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని మోహపాత్ర తెలిపారు. ఇది రేపు అతి తుఫానుగా మారుతుందని మేము ఆశిస్తున్నాము. ఇది ఉత్తరం వైపు వెళ్లి గుజరాత్‌కు చేరుకుంటుందని.. ఆ తర్వాత జూన్ 3న మహారాష్ట్ర తీరానికి చేరుకుంటుందని తెలిపారు. జూన్ 1 లేదా 2 తేదీలలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News